ఈపాస్‌ల కోసం ఏకంగా ట్రంప్‌, అమితాబ్‌లను వాడేశారు..

8 May, 2021 14:55 IST|Sakshi

షిమ్లా : కరోనా వైరస్‌ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వైపు మొగ్గుచూపాయి. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలతో అష్టదిగ్బంధనం చేశాయి. తమ రాష్ట్రంలోకి ప్రవేశించటానికి ఈపాస్‌లు తప్పనిసరి చేశాయి కొన్ని రాష్ట్రాలు. ఈపాస్‌లు ఉన్న వారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఈపాస్‌లతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ప్రముఖ వ్యక్తుల పేర్లతో ఈపాస్‌లకోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ల పేర్లపై ఈపాస్‌లను రిజిస్టర్‌ చేశారు దుండగులు. రెండు ఈపాస్‌లు హెచ్‌పీ-2563825, హెచ్‌పీ2563287.. ఒకే ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌పై రిజిస్టర్‌ చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి : కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు