ముకాబులా పాట ఘంటసాల పాడితే...

4 Feb, 2024 04:18 IST|Sakshi

వైరల్‌

‘రెహమాన్‌జీ... ముక్కాలా ముకాబులా పాటను ఘంటసాల గొంతులో వినిపిస్తే వినాలని ఉంది’ ‘ఒకే ఒక్కడు సినిమాలో జానకి పాడిన ధీరా మగధీరా పాటను భానుమతి గొంతులో వినిపించగలరు’... ఇలాంటి విన్నపాలెన్నో సోషల్‌మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.

రజనీకాంత్‌ ‘లాల్‌ సలాం’ సినిమాలోని ఒక పాట కోసం దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హుమీద్‌ గొంతులను ఏఆర్‌ రెహమాన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో రీక్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రెహమాన్‌ పోస్ట్‌ వైరల్‌ కావడం మాట ఎలా ఉన్నా...‘బంబా బక్యా–షాహుల్‌ హమీద్‌ల గురించి తెలియనివారు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. వారి గురించి విశేషాలు తెలుసుకుంటున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega