సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్‌ ఇవే!

28 Mar, 2024 11:15 IST|Sakshi

చాలా మంది వృద్ధులు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించిన పలు ఘటనలను చూశాం. వాళ్లు అంతకాలం ఎలా జీవించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మరీ అంతకాలం ఎలా జీవించారని కూడా అనుకుంటాం. అందకు రహస్యలివే అంటూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్‌ గోయెంకా ఓ వీడియోని షేర్‌ చేశారు. ఆయన ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గ్‌ ఉంటూ మంచి మంచి వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలానే ఈసారి ఆరోగ్యగానికి సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఓ డాక్టర్‌ సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవిత రహాస్యలను వెల్లడించారు.

ఆ వీడియోలో డాక్టర్‌ నిషిత్‌ చోక్సీ అనే వ్యక్తి 90 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల రోగులతో సంభాషణ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను గురించి చెప్పుకొచ్చారు. దాదాపు తన పేషంట్లలో చాలామంది సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి సంతోషం, సంతృప్తి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పినట్లు తెలిపారు. వాళ్లందరూ చెప్పిన మరో కామన్‌ పాయింట్‌ వ్యాయామం అని అన్నారు. చక్కటి వ్యాయామం దీర్ఘాయువుని నిర్ణయిస్తుందని వారంతా చెప్పినట్లు తెలిపారు. 

తన పేషంట్లలో కొంతమంది వృద్ధులు కర్ర లేకుండా నడవగలరని, కొందరూ అసలు కళ్లద్దాలు ఉపయోగించకుండా పుస్తకాలు, పేపర్లు చదవగలరని చెప్పుకొచ్చారు. వారిలో చాలామంది తమ పనులను వారే స్వయంగా చేసుకుంటారు. అంతేగాదు చాలామంది మోతాదుకు మించి తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అన్నారు. ఓ వయసు వచ్చాక మితంగా తినాలని, అలాగే ఎక్కువ ఒత్తిడిగా ఉన్న సమయంలో మనం తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటాయని కూడా చెప్పారన్నారు. "ఎందుకంటే.. ఒత్తిడిగా ఉంటే కొందరు తినరు, మరికొందరూ అతిగా తింటారు. ఇవి రెండూ కూడా ప్రమాదమే. పిడుగు వచ్చి మీద పడిపోయేంత సమస్య అయినా.. తాపీగా జరేది జరగక మానదు..నా చేతిలో ఏమిలేదు అనేది సత్యాన్ని గట్టిగా విశ్వసించాలి.

అప్పుడూ ఎంతటి ఒత్తడి అయినా తట్టుకుంటారు, నిదానంగా తినేందుకు యత్నిస్తారు. అప్పుడు రక్తపోటు పెరగదు. కాబట్టి జీవితంలో సంతోషం, సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ వీలైనంతలో వ్యాయామం చేయండి చాలు. ఈ మూడే సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకమైనవని డాక్టర్‌ నిషిత్‌ అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి "సుదీర్ఘ జీవితానికి రహస్యాలు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశారు హర్ష గోయెంకా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..ఆ వైద్యుడు చెప్పిన వాటితో ఏకీభవిస్తూ ఆరోగ్యమే అసలైన సంపద అంటూ పోస్టులు పెట్టారు. అలాగే మెదడు షార్ప్‌గా ఉండేలా పజిల్స్‌ లేదా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆరోగ్యంగా ఉంటామని పోస్టుల్లో పేర్కొన్నారు. 

(చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!)


 

Election 2024

మరిన్ని వార్తలు