ఈ గాడ్జెట్స్‌ గురించి విన్నారా!

29 Mar, 2024 09:27 IST|Sakshi

నుబియా జెడ్‌ అల్ట్రా ఫొటోగ్రాఫర్‌ ఎడిషన్‌
నుబియా జెడ్‌ 60 అల్ట్రా కెమెరా ఫోన్‌ 2023 ఆఖరులో ప్రత్యేకమైన 35 ఎంఎం ప్రైమరీ కెమెరా, స్లైడ్‌ ఆల్రౌండ్‌ స్పెసిఫికేషన్‌లతో విడుదలైంది. ఈ ఫోన్‌ ఇప్పుడు కొత్త డిజైన్, అదనపు ఏఐ కెమెరా ఫీచర్‌లతో కొత్త వెర్షన్‌గా వస్తోంది. దీనికి నూబియా జెడ్‌ 60 అల్ట్రా ఫొటోగ్రాఫర్‌ ఎడిషన్‌గా పిలుస్తున్నారు.

గెలాక్సీ ఏఐ
గెలాక్సీ ఎస్‌ 24 సిరీస్‌ ఆఫ్‌ స్మార్ట్‌ఫోన్‌లతో గత ఫిబ్రవరిలో శాంసంగ్‌ గెలాక్సీ ఏఐ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లను ప్రీవియస్‌ జనరేషన్‌ ఫ్లాగ్‌షిప్స్‌కు (ఫోల్డబుల్‌ అండ్‌ నాన్‌–ఫోల్డబుల్‌ డివైజ్‌)కు అందుబాటులోకి తీసుకురానుంది. ‘ఇప్పుడు శాంసంగ్‌ గెలాక్సీ ఎకోసిస్టమ్‌ అంతటా మరింత మంది వినియోగదారులకు గెలాక్సీ ఏఐ ఫీచర్‌లను తీసుకువస్తోంది’ అని అధికారిక ప్రెస్‌నోట్‌లో శాంసంగ్‌ తెలియజేసింది.

ప్రొఫిసీ ల్యాప్‌టాప్‌ స్టాండ్‌
బ్రాండ్‌: ప్రొఫిసీ కలర్‌ : స్పేస్‌ గ్రే
ఎత్తు పెంచడానికి, సరిౖయెన యాంగిల్‌లో కనిపించడానికి సులభంగా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.
కంపాటబుల్‌: 11–17 అంగుళాల ల్యాప్‌టాప్స్‌
బరువు: 950 గ్రా.

లెనోవా ట్యాబ్‌ ఎం 11
లెనోవా కొత్త బడ్జెట్‌ ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌ ఎం 11ను విడుదల చేసింది. కొన్ని వివరాలు...
సైజ్‌: 11.0 అంగుళాలు
స్క్రీన్‌ రిజల్యూషన్‌: 1200్ఠ1920 పిక్సెల్స్‌

ర్యామ్‌: 8జీబి
ఇంటర్నల్‌ మెమోరీ: 128 జీబి
బరువు: 465 గ్రా.
బ్యాటరీ: 7040 ఎంఏహెచ్‌

ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'

Election 2024

మరిన్ని వార్తలు