'బ్లడ్‌ మనీ డీల్‌': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!

13 Dec, 2023 15:25 IST|Sakshi

బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. అప్పటిదాక గడప దాటని అమాయకపు తల్లి అయినా బిడ్డ జోలికొస్తే.. శివంగిలా మారిపోతుంది. ఏదో విధంగా కాపాడాలని తపించిపోతుంది. అలానే ఇక్కడొక తల్లి కూడా వెరొక దేశంలో అనుకోని పరిస్థితుల్లో మర్డర్‌ కేసులో చిక్కుకుని విలవిలలాడుతున్న కూతుర్ని రక్షించాలని తప్పనపడింది. అందుకు ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకోవడమే ఒక్కటే ఆ తల్లి ముందున్న మార్గం. అయితే ఆ దేశానికి భారతీయ పౌరులెవ్వరికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి హైకోర్టులో పోరాడి అనుమతి తెచ్చుకుని మరీ వెళ్లేందుకు పయనమవుతుంది. అక్కడ వాళ్లతో 'బ్లడ్‌ మనీ డీల్‌' చేయబోతోంది. ఏంటీ బ్లడ్‌ మనీ డీల్‌..? ఏంటా ఆ తల్లి గాథ అంటే..

నిమిషా ప్రియా అనే ఒక నర్సు 2011లో యెమెన్‌కి వెళ్లింది. అక్కడ ఆమె సనాలో నర్సుగా పనిచేసేది. అయితే ఏం జరిగిందే ఏమో 2017 యెమెన్‌ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. ఆమె సన్నిహితుల ప్రకారం..ఆమె పాస్‌పోర్ట్‌ని మహదీని తీసుకుని ఇవ్వకపోవడంతో ఎలాగైన అతడి నుంచి తీసుకునే క్రమంలో మహదీన్‌కి మత్తు మందులను ఇంజెక్ట్‌ చేసింది. దీంతో అతడు మరణించాడు. ఏం చేయాలో పాలుపోని నిమిషా తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో అతడి శవాన్ని ముక్కలు చేశారు.

అయితే నిమిషా పోలీసులకు దొరికిపోయింది. దీంతో యెమెన్‌ ట్రయల్‌ కోర్లు కేసుని విచారించి..నిమిషాకి మరణ శిక్ష విధించగా, ఆమె సహోద్యోగికి జీవత ఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్‌ జైలులోనే ఉంది. అప్పటి నుంచి నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యెమెన్‌ సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే..? అక్కడ ఆమె అప్పీలును తిరస్కరించింది యెమెన్‌ సుప్రీం కోర్టు. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే 'బ్లడ్‌ మనీ డీల్‌' ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది తిరిగి భారత్‌లోని తన కుటుంబం చెంతకు వెళ్లిపోవచ్చు.

అందుకోసం ఆమె తల్లి ప్రేమ కుమారి యెమెన్‌కి వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్‌కి ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యోమెన్‌కి వెళ్లటం ఆమెకు అసాధ్యం అందుకని ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతురుని రక్షించుకోవడానికి యెమెన్‌ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యెమెన్‌తో భారత్‌కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు పేర్కొంది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకి తెలిపింది.

దీంతో హైకోర్టు భారత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకుండా తన స్వంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆ తల్లిని కోరింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ (బుధవారం)ఆ తల్లికి పశ్చిమ ఆసియా దేశమైన యెమెన్‌ వెళ్లి తన కూతురు విడుదల కోసం "బ్లడ్‌ మనీ డీల్‌" చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 

'బ్లడ్‌ మనీ డీల్‌' అంటే..
యెమెన్‌ షరియా చట్టాల ప్రకారం ఆమెను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడాన్ని " బ్లడ్‌ మనీ డీల్‌" అంటారు. అందుకోసం ఆ తల్లి వెళ్లడం అత్యంత ముఖ్యం. ఏదీఏమైన తన కూతురు కోసం ఆ తల్లి పడుతున్న కష్టం ఫలించాలని ఆశిద్దాం. 

(చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్‌ చూసి కంగుతిన్న వైద్యులు)


 

>
మరిన్ని వార్తలు