Sharmila Yadav: డ్రోన్‌ దీదీ

10 Mar, 2024 01:04 IST|Sakshi

వైరల్‌

హరియాణాకు చెందిన షర్మిల యాదవ్‌ పెద్ద చదువులు చదువుకోవాలని కల కన్నది. అయితే ఇంటర్మీడియేట్‌ పూర్తికాగానే ‘ఇక చాలు’ అన్నారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన తరువాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలైనప్పటికీ షర్మిలకు చదువుపై ఉన్న ఇష్టం మాత్రం పోలేదు. ‘డ్రోన్‌ సిస్టర్‌’ ప్రోగ్రాంలో భాగంగా  మహిళలకు డ్రోన్‌ పైలట్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారని తెలుసుకున్న షర్మిల ట్రైనింగ్‌ కోర్సులో చేరింది. 

ఫస్ట్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ‘మరో ప్రయత్నం చెయ్యి’ అని ప్రోత్సహించారు. సెకండ్‌ టైమ్‌ టెస్ట్‌ పాస్‌ అయిన షర్మిల ఇప్పుడు సర్టిఫైడ్‌ డ్రోన్‌ పైలట్‌గా గుర్తింపు పొందింది.

ఎలాంటి టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా మాస్టరింగ్‌ కంట్రోల్స్, హైట్‌ అండ్‌ స్పీడ్‌ రీడింగ్, స్మూత్‌ టేక్‌–ఆఫ్, ల్యాండింగ్స్‌...మొదలైన సాంకేతిక విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంది.  ఇప్పుడు ఆమెను అందరూ ‘డ్రోన్‌ దీదీ’ అని పిలుస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో డ్రోన్‌ పైలట్‌గా చేతి నిండా పనితో మంచి ఆదాయన్ని అర్జిస్తోంది. వ్యవసాయ భూముల్లో షర్మిల యాదవ్‌ డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Election 2024

మరిన్ని వార్తలు