పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!

28 Mar, 2024 11:49 IST|Sakshi

మన దేశంలో పాము కాటుకు ఏటా వేలాదిమంది చనిపోతున్నారు. పాము కాటు వేసిన వెంటనే విషం బాడీలోకి వెళ్లి..మనిషి నురగలు కక్కుకుంటూ చనిపోవడం జరుగుతుంది. మరింత విషపూరితమైన పాము అయితే అంతా క్షణాల్లో అయిపోతుంది. ఒక్కోసారి మనం వైద్యుడు వద్దకు తీసుకువెళ్లే వ్యవధి కూడా సరిపోదు. సకాలంలో రోగికి విరుగుడు ఇంజెక్షన్‌ అందితే ఓకే లేందంటే అంతే సంగతి. ఇక్కడ విషం శరీరంలోకి వెళ్లిన వెంటనే ఏం జరగుతుందనేది అందరికి కుతుహలంగానే ఉంటుంది కదా. అయితే పాము   విషం ఎలా మన శరీరంలో రక్తంతో రియాక్షన్‌ చెందుతుందో ఈ వీడియో ద్వారా  ప్రత్యక్ష్యంగా తెలుసుకోండి 

పాము మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో ప్రయోగం చేసి మరీ  చూపించారు.ఈ వీడియోలో, ఒక నిపుణుడు గాజు పాత్రలో పాము విషాన్ని సేకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ విషం ఇప్పటికే నిల్వ చేయబడిన మానవ రక్తంతో ఎలా రియాక్షన్‌ చెందుతుందో చూపించడం జరగుతుంది.  పాము విషం జస్ట్‌ ఒక్క చుక్క రక్తంలో కలవగానే రక్తం గడ్డకట్టడం కనిపిస్తుంది. ఒక్క విషపు చుక్క ఎంత స్పీడ్‌గా ప్రభావితం చేస్తుందో వీడియోలో క్లియర్‌గా తెలుస్తుంది.  ఎప్పుడైతే రక్తం గడ్డకట్టుకుపోతుందో అప్పుడూ గుండెకు రక్తం సరఫరా అవ్వడం నిలిచిపోతుంది. వెంటేనే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.

అందవల్ల పాము ఎలాంటిది కరిచినా వెంటనే ఆ ప్లేస్‌ని క్లాత్‌తో గట్టిగా కట్టి సకాలంటో వైద్యుల వద్దకు తీసుకువెళ్లి విరుగుడు ఇంజెక్షన్‌ ఇవ్వాలి.  అంతేగాదు ఈ పాము కాటు కారణంగా భారతదేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించిది. గత 20 ఏళ్లలో ఏకంగా 2 లక్షల మంది పాముకాటుతోనే చనిపోయినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంటే ప్రతీ ఏడాది పాముకాటు కారణంగా దాదాపు 58 వేలమంది దాక చనిపోతున్నట్లు లెక్కలు వేసి మరీ పేర్కొంది. అలాగే ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాము కాటు మరణలు ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆరోగ్య సంస్థ తెలపడం గమనార్హం. 

(చదవండి: సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్‌ ఇవే!)

Election 2024

మరిన్ని వార్తలు