-->

ఈవీఎంల పనితీరుపై అవగాహన

28 Mar, 2024 01:20 IST|Sakshi
ఈవీఎంల పని తీరుపై సెక్టార్‌ అధికారులకు అవగాహన కల్పిస్తున్న ట్రైనర్లు

హన్మకొండ అర్బన్‌: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో వినియోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవీఎంల) పనితీరుపై కలెక్టరేట్‌లో సెక్టార్‌ అధికా రులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. జిల్లాలోని సెక్టార్‌ అధికారులు పోలింగ్‌ తేదీన ఈవీఎంల నిర్వహణ, వాటి పని తీరు, వివిధ అంశాలపై మోడల్‌ ఈవీఎంల (కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వివి ప్యాట్‌) తో నిపుణులు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. పోలింగ్‌ రోజు మాక్‌ పోల్‌ మొదలుకొని, పోలింగ్‌ అనంతరం సెక్టార్‌ అధికారులు నిర్వర్తించే విధుల గురించి ట్రైనర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్‌, మాస్టర్‌ ట్రైనర్లు భాస్కర్‌రెడ్డి, రవి, రాంబా బు, పృథ్వీ, శివకోటి, శ్రీధర్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు