వూహాన్‌లో అత్యవసర వ్యాక్సినేషన్‌

30 Dec, 2020 04:49 IST|Sakshi

బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు స్థానమైన వూహాన్‌లో చైనా ప్రభుత్వం ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్‌ మొదలు పెట్టింది. కోటి మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరంలోని 15 జిల్లాల్లో డిసెంబర్‌ 24వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలైనట్లు సమాచారం. నగరంలో 48 కేంద్రాలను ఏర్పాటు చేసి 18–59 మధ్య వయస్సు వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు టీకా డోసులు ఇస్తున్నట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హి ఝెన్యు తెలిపారని అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.  

>
మరిన్ని వార్తలు