వెబ్‌సైట్ల రారాజు గూగులే..

7 Jan, 2024 05:19 IST|Sakshi
(వీటిలో గూగుల్‌ క్లౌడ్‌ సర్వీసులకు సంబంధించినది గూగుల్‌ ఏపిస్‌ సైట్‌కాగా.. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన డేటాను క్రోడీకరించి వేగంగా లోడ్‌ చేసేది జీస్టాటిక్‌ వెబ్‌సైట్‌. ఇక అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌.. ఆ సంస్థ క్లౌడ్‌స్టోరేజీ, రిమోట్‌ కంప్యూటింగ్‌ వెబ్‌సైట్‌)

ఇంటర్‌నెట్‌ ఓపెన్‌ చేస్తే చాలు మొదట వెళ్లేది గూగుల్‌ వెబ్‌సైట్‌కే. వార్తల నుంచి ఫొటోలు, వీడియోల దాకా ఏ సమాచారం కావాలన్నా వెతికేది అందులోనే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ వెబ్‌సైట్‌గా గూగుల్‌ నిలిచింది. అంతేకాదు.. అత్యధిక యూజర్‌ ట్రాఫిక్‌ ఉండే టాప్‌–10 వెబ్‌సైట్లలో నాలుగు గూగుల్‌కు చెందినవే.  

► నిజానికి చాలా ఏళ్లుగా గూగుల్‌ వెబ్‌సైటే టాప్‌లో ఉంటూ వస్తోంది. అయితే టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ 2021 ఏడాది చివరిలో కొద్దిరోజులు గూగుల్‌ను వెనక్కి నెట్టి టాప్‌లో నిలవడం గమనార్హం.

► పాపులర్‌ సైట్ల లిస్టులో యూట్యూబ్‌ 11వ స్థానంలో, అమెజాన్‌ 18వ, ఇన్‌స్ట్రాగామ్‌ 24వ, నెట్‌ఫ్లిక్స్‌ 25వ, వాట్సాప్‌ 29వ, స్పాటిఫై 35వ, స్నాప్‌చాట్‌ 40వ, ట్విట్టర్‌ 45వ, లింక్‌డ్‌ఇన్‌ 68వ, జీమెయిల్‌ 79వ స్థానాల్లో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు