Mars Helicopter Mission Ends: మార్స్‌పై మినీ హెలికాప్టర్‌ క్రాష్‌.. ప్రకటించిన నాసా

26 Jan, 2024 08:12 IST|Sakshi

కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్‌)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్‌ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్‌ అయ్యే సమయంలో రోటర్‌ చెడిపోయి మినీ హెలికాప్టర్‌ క్రాష్‌ అయినట్లు నాసా ప్రకటిం‍చింది.  

మార్స్‌పై ఇన్‌జెన్యూటీ మినీ హెలికాప్టర్‌ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌ క్రాష్‌కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్‌లో మార్స్‌పై ల్యాండ్‌ అయినప్పుడు తొలుత హెలికాప్టర్‌ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు.

అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్‌పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్‌ ప్రయోగాలకు ఇన్‌జెన్యూటీ నాంది పలికింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను ప్రిజర్వెన్స్‌ రోవర్‌ ఆపరేట్‌ చేసింది.  

ఇదీచదవండి.. మూన్‌ ష్నైపర్‌ శీర్షాసనం

whatsapp channel

మరిన్ని వార్తలు