భారత అంతర్గత వ్యవహరాలపై స్పందించిన యూఎన్‌ఓ

29 Mar, 2024 10:56 IST|Sakshi

న్యూయార్క్‌: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయటం వంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)స్పందించింది. అయితే ఇటీవల ఈ విషయాలపై అమెరికా స్పందించగా.. భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు కూడా జరీ చేసింది. ఒక్కరోజు వ్యవధిలో ఐక్యరాజ్య సమితి స్పందించటం గమనార్హం.

భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు విపక్ష సీఎం అరెస్ట్‌, ప్రతిపక్షపార్టీ ఖాతాల స్తంభనతో నెలకొన్న రాజకీయ అనిశ్చిత్తిపై ఓ విలేకరి ప్రస్తావించగా.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు. ‘ఇండియా, ఎన్నికలు జరిగే ప్రతి దేశంలోను ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అకౌంట్లపై అమెరికా రెండోసారి స్పందించటం గమనార్హం. అయితే దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి పూర్తిగా తమ దేశ  అంతర్గత విషయాన్ని స్పష్టం చేసింది. ఆయా తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

Election 2024

మరిన్ని వార్తలు