US: భారత్‌కు సాయం కొనసాగుతుంది

19 May, 2021 08:25 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు అండగా నిలుస్తామని పునరుద్ఘాటించింది. భారత్‌కు అందిస్తున్న తాము అందిస్తున్న సాయం ఇకపై కూడా కొనసాగుతుందని శ్వేతసౌధం ప్రెస్‌ కార్యదర్శి జెన్‌సాకి తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగే రోజువారీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా జెన్‌సాకి ఈ విషయం చెప్పారు. భారత్‌కు 100 మిలియన్‌ డాలర్ల విలువైన మెడికల్‌ సాయాన్ని అందిస్తామని బైడెన్‌ ప్రకటించారన్నారు. ఇప్పటికే ఏడు విమానాల  ద్వారా భారత్‌కు సాయం పంపినట్లు గుర్తు చేశారు.

అందులో ఏడో షిప్‌మెంట్‌లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఉన్నట్లు వెల్లడించారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులకు అవి ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ సాయం కొనసాగుతుందని చెప్పారు. భారత్‌ తమకు ముఖ్యమైన భాగస్వామి అని కితాబిచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణాత్మక సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.  అందుకు ప్రస్తుతం తాము అందిస్తున్న మెడికల్‌సాయం ఉపయోగపడుతుందన్నారు. కరోనా కేసులు, మరణాలు తగ్గేందుకు అవి సాయం చేస్తాయన్నారు.

(చదవండి: బైడెన్‌ దంపతుల ఆదాయమెంతో తెలుసా?)

మరిన్ని వార్తలు