మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం

26 Aug, 2020 18:35 IST|Sakshi

లండన్‌ : ‘మేము ముఖానికి మాస్కులు ధరించాం. ఇక మాకు కరోనా ఎలా వస్తుంది? రాదు’ అన్న దీమాతో చాలా మంది ప్రజలు ఇంటా బయట భౌతిక దూరం పాటించడం లేదు. ‘మనకే కాదు, ఎదుటి వారికి కూడా మాస్కులు ఉన్నాయి గదా!’ అన్న ధీమాతో ఇతరులకు దగ్గరగా నిలపడుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. లండన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముఖానికి మాస్కులు ధరించడం అలవాటు చేసుకున్న ప్రజలంతా మళ్లీ సామాజిక లేదా భౌతిక దూరం పాటించడానికి సుముఖంగా లేరని సర్వే నిర్వహించిన పరిశోధకలు తెలియజేశారు. మరోసారి కరోనా వైరస్‌ రెండోసారి దాడి చేసినట్లయితే ప్రజలతో భౌతిక దూరం పాటించేలా చేయడం చాలా కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మాస్కులు ధరిస్తుండడం వల్ల లండన్‌లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని, ఆ విషయం వారి భరోసా పెంచి ఉంటుందని వారంటున్నారు. కానీ మాస్కులు, భౌతికదూరం, చేతుల శుభ్రత అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తున్న వారిలో మాస్కులు ధరిస్తున్న వారే ఎక్కువగా ఉండడం సర్వేలో బయటపడిన మరో విశేషం.

చదవండి: కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!

మరిన్ని వార్తలు