ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..

30 Oct, 2023 10:06 IST|Sakshi
నిఖిల్‌ (ఫైల్‌)

సాక్షి, మహబూబాబాద్‌: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్‌(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని..

మరిన్ని వార్తలు