ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఉరేసుకున్న కొడుకు.. కొడుకు కోసం తండ్రి!

1 Dec, 2023 09:42 IST|Sakshi
నర్సింహులు (ఫైల్‌)

ధరూరు: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరులో చోటుచేసుకుంది. వివరాల్లో వెళ్తే.. మండల కేంద్రంలోని కుర్వవీధికి చెందిన గడ్డమీది నర్సింహులు (65), దౌలమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

అక్టోబర్‌ 5న వెలువడిన కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు దేవార్జున్‌ (25).. అదే రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. నెలన్నర రోజులుగా కొడుకు చనిపోయిన బాధలో ఉన్న నర్సింహులు.. గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు