సర్కారుబడులు.. కార్పొరేట్‌ హంగులు

20 Jun, 2023 01:00 IST|Sakshi
ప్రారంభానికి ముస్తాబైన సర్కారు బడి

నేడు విద్యాదినోత్సవం

పాఠ్యప్తుస్తకాలు, యూనిఫాంలు అందజేత

నోట్‌పుస్తకాల పంపిణీ

పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్‌లు
జిల్లాలో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2.57 లక్షలు నోట్‌పుస్తకాలు కేటాయించారు. జిల్లాకు 50వేలు నోట్‌ పుస్తకాలు చేరడంతో బెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల, దండేపల్లి మండలం మామిడిపల్లి, కోటపల్లి మండలం పారిపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 4,32,243 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 2,81,160 పుస్తకాలు చేరాయి. జిల్లాలో 50,032 మంది వి ద్యార్థులకు అవసరమైన 2,32,750 మీటర్ల ముడి వస్త్రం చేరింది. ఇందులో 80శాతం మేర యూనిఫామ్‌లు పూర్తయిన వాటిని విద్యార్థులకు అందించనున్నారు. 149 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి.

మంచిర్యాలఅర్బన్‌: మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో కార్పొరేట్‌ తరహాలో ఆధునిక అందుబాటులోకి వస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినో త్సవాన్ని పురస్కరించుకుని అన్ని హంగులతో తీర్చి దిద్దిన 12పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇ ప్పటికే 35 పాఠశాలల్లో 18 మొదలయ్యాయి. రెండు జతల యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందించనున్నారు. తెలంగాణ సేట్‌ టెక్నోలా జికల్‌ సర్వీసెస్‌ సాయంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్‌ బోధన అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్‌ ఎస్‌(ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ స్క్రీన్‌) టీవీల ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బోధనకు ఏర్పాట్లు చేశారు. విద్యాది నోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీలు, తల్లి దండ్రులను ఉద్దేశించి ఉత్తరాల పంపిణీ, గ్రామాల్లో వీధి నాటకాలు, జాతీయ జెండా ఆవిష్కరణ, పదేళ్లలోపు పురోగతిపై ప్రసంగం, తెలంగాణలో పాఠశాల విద్య, విజన్‌ కార్యకలాపాలపై వివరిస్తారు. పాఠశాలలకు సేవలందించిన ముగ్గురు దాతలను సన్మానిస్తారు. 10మంది హెచ్‌ఎంలు, 15 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఎస్‌ఎంసీ చైర్మన్‌, ఐదుగురు పేరెంట్స్‌, 12 మంది 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సత్కరిస్తారు.

జిల్లాలో ఇలా..
మన ఊరు–మనబడిలో 248 పాఠశాలలు ఎంపిక చేశారు. ఇందులో 31 బడులను అన్ని హంగులతో తీర్చిదిద్దగా మరో 12 మంగళవారం ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించనున్నారు. మందమర్రి(దీపక్‌నగర్‌), జైపూర్‌ మండలం దోరగాపల్లి, పవనూర్‌(హరిజనవాడ), కోటపల్లి మండలం మల్లంపేట్‌, పారిపల్లి హైస్కూల్‌, దండేపల్లి పీఎస్‌, ఉన్నత పాఠశాలలు, బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎంపీపీఎస్‌ నీల్వాయి, కుశ్నపల్లి, కాసిపేట మండలం సోనాపూర్‌, మంచిర్యాల పట్టణంలోని న్యూగర్మిళ్ల పాఠశాలలు లాంఛనంగా ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు