చివరి షెడ్యూల్‌లో చరణ్‌-చిరంజీవిల మధ్య కీలక సన్నివేశాలు!

27 Jun, 2021 14:58 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కేవలం 12 రోజుల షూటింగ్‌ మాత్రమే ఉంది. వచ్చే నెల రెండో వారం నుంచిఘీ మూవీ తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌పై కొన్ని ముఖ్య సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. చివరి షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ అయిపోతే ఆచార్య షూటింగ్‌ పూర్తయినట్లే. దీంతో గుమ్మడికాయ కొట్టేందుకు మూవీ యూనిట్‌ సిద్ధమవుతుంది.

నిజానికి అంతా సజావుగా సాగితే మే13నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‌కు ఆటంకం కలిగింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పటికే పలు ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్లాయి. తాజాగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సైతం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

చదవండి : ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు
లోకల్‌ ట్రైన్‌లో రజనీ అలా.. ఫోటోలు లీక్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

మరిన్ని వార్తలు