Actor Naresh: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

12 Feb, 2022 19:08 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన టాలీవుడ్‌ ప్రముఖుల భేటీపై తాజాగా మాజీ ‘మా’ అధ్యక్షుడు, సీనియర్‌ నటుడు నరేశ్‌ స్పందించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. రీసెంట్‌గా సీఎం జగన్‌తో జరిగిన సినీ పెద్ద సమావేశం అభినందనీయమని పేర్కొన్నాడు. ఈ భేటీపై నరేశ్‌ హర్షం వ్యక్తం చేస్తూనే.. ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో వర్క్ షాప్ అవసరమని సోషల్‌ మీడియా వేదిక అభిప్రాపడ్డాడు.

చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్‌ వర్మ భార్య షాకింగ్‌ కామెంట్స్‌

ఈ మేరకు ‘సీఎం జగన్‌తో భేటీ  ప్రశంసించదగ్గదని. కానీ ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రయోజనాల కోసం ఒక వర్క్ షాప్ పెట్టడం అవసరం. తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబించే విధంగా.. ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మానాలు జారీ చేయాలి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

చదవండి: ఆ సినిమా కోసం అమెజాన్‌ ప్రైమ్‌ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా?

కాగా ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న సీఎం జగన్‌తో జరిగిన ఈ సమావేశానికి టాలీవుడ్‌ తరపున మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, ప్రభాస్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌ నారాయణమూర్తి, పోసాని కృష్ణ మొరళితో పాటు ఇతర ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్ల అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతి మేరకు సీఎం జగన్‌ ఏపీలో 5వ షోకు అంగీకారం తెలిపారు. ఇక ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ పెద్దలు.. త్వరలోనే పరిశ్రమకు శుభవార్త వస్తుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు