విషాదం: కరోనాతో హీరోయిన్‌ సోదరుడు మృతి 

4 May, 2021 13:47 IST|Sakshi

 వెంటిలేటర్‌, బెడ్‌  కోసం ప్రయత్నిస్తుండగానే  మృతి

సినీ రంగాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి

లక్నో: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు పుంజుకోవడంతో ఎక్కడ చూసినా మందులులేక, వెంటిలేటర్లు అందబాటులో లేక, , ఆసుపత్రులలో ఐసీయూ బెడ్స్ దొరకక, ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు  కోల్పోతున్న వైనం  మరింత ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో మహమ్మారి  ప్రకంపననలు పుట్టిస్తోంది. తాజాగా  హీరోయిన్ పియా బాజ్‌పాయ్ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పియా బాజ్‌పాయ్‌​ సోదరుడు కరోనాతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో తన సోదరుడికి కరోనా సోకి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటిలేటర్‌, బెడ్‌, కావాలని కోరుతో పియా ట్వీట్‌ చేసిన కొన్ని గంటలకే అతడు మృతి చెందాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటిలేటర్ సపోర్ట్ లేకపోవడంతో తన సోదరుడు కరోనాకు బలైపోయాడంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన కళ్లముందే అతని ప్రాణాలు పోవడం  చూసి తట్టుకోలేపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గత 24 గంటల్లో ఇద్దరు ఆప్తులను కోల్పోయానని, మరో ముగ్గురి పరిస్థితి క్రిటిక్‌ల్‌ వుందని నటి భూమి పడ్నేకర్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే వెబ్ సిరీస్ కోసం షూటింగ్‌లో ఉన్న మరో నటుడు అనిరుధ్ డేవ్ కూడా కోవిడ్-19 కారణంగా భోపాల్‌లోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల మ్యూజిక్‌ డైరెక్టర్‌ సహా పలువురు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

కాగా 2008లో తమిళ చిత్రం పోయి సోల్లా పోరోమ్‌తో  పియా తన యాక్టింగ్‌ కరియర్‌ను ప్రారంభించారు.  ఆ తరువాత  హీరో అజిత్  ఏగన్,  జివా  కో చిత్రాలలోని పాత్రలతో గుర్తింపు  తెచ్చుకున్నారు.  ఆ తరువాత తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మూవీల్లో కూడా కనిపించారు. విజయలక్ష్మి దర్శకత్వంలో 2018 తమిళ-మలయాళ ద్విభాషా అభియుం అనువం మూవీలో ఆమె చివరిసారిగా బిగ్‌స్క్రీన్‌పై కనిపించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు