ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక

27 Apr, 2021 20:51 IST|Sakshi

హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ ఖజానా జ్యువెలరీ తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి శ్రీమతి రష్మిక మందన్నను ప్రకటించింది. దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానుల సంఖ్య గల ప్రముఖ తారలలో రష్మిక ఒకరు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. అక్షయ తృతీయతో ప్రారంభించి భారతదేశం అంతటా ప్రింటింగ్, బహిరంగ, టీవీలలో ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీకి చెందిన అందమైన డిజైన్‌లను ఆమె ప్రమోట్ చేయనుంది.

ఈ ఒప్పందంపై ఖజానా జ్యువెలరీ చైర్‌పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "మా బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీమతి రష్మికను ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే నెలల్లో ఆమెతో మేము అనేక రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాము. మా బ్రాండ్, మా కస్టమర్ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలని" చూస్తున్నాము అని అన్నారు. ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ఖజానా గొప్పతనం గురుంచి అందరికీ తెలిసిందే, నన్ను దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం నాకు సంతోషం కలిగిస్తుంది. వారి ప్రత్యేకమైన నమూనాలు, ఉన్నతమైన విలువల గురుంచి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను వారితో భాగస్వామ్యం కావడం గురించి సంతోషిస్తున్నాను. అలగే, ఖాజానా స్టోర్లలో ఉన్న కొత్త కలెక్షన్స్ చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను” అని తెలిపింది.

ఖజానా జ్యువెలరీ బిఐఎస్ హాల్‌మార్క్డ్ 916 బంగారు ఆభరణాలను అమ్మడం, అధిక-నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా భాగా ప్రాచుర్యం పొందింది. తక్కువ ధరలో మెరుగైన నాణ్యమైన ఆభరణాలను వినియోగదారులకు అందిస్తుంది. ఒక వ్యాపార సంస్థగా మాత్రమే కాకుండా, ఖజానా జ్యువెలరీ క్రమం తప్పకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాల కోసం సంస్థ తన లాభాలలో కొంత భాగాన్ని కేటాయిస్తుంది. ఖజానా జ్యువెలరీని 1993లో చెన్నైలోని కేథడ్రల్ రోడ్‌లో మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మొదటి షోరూమ్‌ ను ప్రారంభించారు. ఇన్ని సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ గల సంస్థగా ఎదిగింది. భారతదేశం అంతటా 50కి పైగా షోరూమ్‌లు కలిగి ఖాజానా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బంగారం, వెండి ఆభరణాల వ్యాపార సంస్థగా ఇప్పుడు నిలిచింది.

చదవండి: 

ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక

మరిన్ని వార్తలు