దుస్తులపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నాయ‌కురాలిపై ఉర్ఫి జావేద్‌ ఫిర్యాదు

13 Jan, 2023 18:41 IST|Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి బిగ్‌బాస్‌ ఓటీటీ ఫేం, బుల్లితెర నటి ఉర్ఫి జావేద్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు.బాదే భయ్యా కీ దుల్హనియా’సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఉర్ఫి.. ‘దుర్గా’, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో పాల్గొన్న మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఢిఫరెంట్‌ డ్రెస్‌లతో అందరినీ అట్రాక్ట్‌ చేస్తుంటుంది 25 ఏళ్ల ఈ భామ.

తాజాగా ఉర్ఫి జావేద్‌.. బీజేపీ మహిళా నేత చిత్ర కిషోర్‌ వాఘ్‌కు వ్యతిరేకంగా మ‌హారాష్ట్ర మ‌హిళా కమిష‌న్‌ను ఆశ్రయించింది. తను ధరించే దుస్తులపై వాఘే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న నటిపై బెదిరింపులకు పాల్పడినందుకు వాఘ్‌పై ఫిర్యాదు నమోదైందని ఉర్ఫి తరపు న్యాయవాది నితిన్‌ సత్పుటే తెలిపారు.

ప్రజల్లో గుర్తింంపు పొందిన మోడల్/నటికి హాని కలిగించేలా బీజేపీ నేత చిత్ర కిషోర్ వాఘ్‌పై ఐపీసీ సెక్షన్‌  U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద  ఫిర్యాదు చేశాను. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రుపలీ చకంకర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే చిత్ర వాఘే వ్యాఖ్యల అతనంరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరాను’ అని జావేద్ తరపు న్యాయవాది నితిన్ సత్పుటే అన్నారు.

కాగా జనవరి 4న బీజేపీ నేత కిషోర్‌ వాఘే ఉర్ఫి జావేద్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె డ్రెస్సింగ్‌పై మ‌హిళా క‌మిష‌న్ ఏమైనా చేస్తుందా? అని ప్ర‌శ్నించారు. వీధుల్లో బ‌హిరంగంగా అర్ధ‌న‌గ్నంగా మ‌హిళ‌లు న‌డుస్తున్నారని ఈ  విష‌యాన్ని మ‌హిళా క‌మిష‌న్ ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.. ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అని ప్ర‌శ్నించారు. ఈ నిర‌స‌న ఉర్ఫిజావేద్‌పై కాదని అలా అర్ధ‌న‌గ్నంగా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న‌డ‌వ‌డంపై మాత్ర‌మే అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.   ఈ ట్వీట్ల‌పై స్పందించిన ఉర్ఫి జావేద్ త‌న న్యాయ‌వాది ద్వారా మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు