ప్రమాదం జరిగినా షూటింగ్‌ కంటిన్యూ చేసిన విశాల్‌

19 Jun, 2021 10:57 IST|Sakshi

హైదరాబాద్‌ : తమిళ స్టార హీరో విశాల్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమిళ స్టార్‌ హీరో విశాల ప్రస్తుతం  ‘నాట్ ఏ కామ‌న్ మేన్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇందులో  భాగంగా ఓ ఫైట్‌ సీన్‌ చేస్తుండగా విశాల్‌ తలకు గాయమైంది. డూప్‌ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్‌ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్రయూనిట్‌ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగినా బ్రేక్‌ తీసుకోకుండా విశాల్‌ నటించడం విశేషం.

ఇక ఈ ప్రమాదంపై హీరో విశాల్‌ స్పందిస్తూ.. తృటిలో తప్పించుకున్నానని, ఆ ఫైటర్‌ తప్పేమీ లేదని చెప్పారు. టైమింగ్‌ మిస్‌ అయ్యిందని, అయినా యాక్షన్‌ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమేనని పేర్కొన్నారు. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్‌ కంటిన్యూ చేశామని, యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు ఫైట్ మాస్టర్  రవివర్మకు థ్యాంక్యూ అని విశాల్‌ పేర్కొన్నారు. ఫైట్‌ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇక విశాల్‌31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. 

చదవండి : Vishal31 : మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసిన విశాల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు