వైరలవుతున్న అవికా గోర్‌ పెళ్లి ఫొటో!

28 Mar, 2021 16:18 IST|Sakshi

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో చిన్నప్పుడే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నటి అవికా గోర్‌. తర్వాత 'ఉయ్యాల జంపాల', 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కాదిల్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటుడు ఆదిల్‌ ఖాన్‌ సరసన ఆడిపాడుతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ చర్చిలో పెళ్లాడుతున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ఫ్యాన్స్‌ గందరగోళానికి గురయ్యారు. ఏంటి? వీళ్లు పెళ్లి చేసుకున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో నెట్టింట ఈ ఫొటో వైరల్‌గా మారింది. కానీ అసలు విషయానికి వస్తే..  వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న కాదిల్‌ పాటలోని స్టిల్లే ఆ వెడ్డింగ్‌ ఫొటో. అంతే తప్ప వాళ్లు నిజంగా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం అర్థమైన అభిమానులు తప్పులో కాలేసామే అంటూ నాలుక్కరుచుకుంటున్నారు. మరికొందరేమో ఇది పబ్లిసిటీ స్టంట్‌ అని తమకు ఎప్పుడో అర్థమైందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ హీరోయిన్‌ రోడీస్‌ 17 కంటెస్టెంట్‌ మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతోంది. ఈ విషయాన్ని ఆమె గతేడాది అధికారికంగా వెల్లడించింది. శనివారం మిలింద్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ ఓ సుదీర్ఘ ప్రేమ లేఖను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

A post shared by Avika Gor (@avikagor)

చదవండి: సినిమా బ్యానర్‌ మార్చి ఓటీటీకి.. సహా నిర్మాతపై ఫిర్యాదు

అనుష్కకు ‘అరణ్య’ స్పెషల్‌ గిఫ్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు