లైంగిక వేధింపుల కేసు.. పోలీసులకు బిగ్‌ షాకిచ్చిన నటి!

17 Sep, 2023 15:06 IST|Sakshi

ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి  నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. 

(ఇది చదవండి: మహేశ్‌ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ రెడీ.. ఎక్కడో తెలుసా?)

అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.  సీమాన్‌ పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.  సీమాన్‌ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష‍్మి యూటర్న్ తీసుకుంది. వలసర వాక్కం పోలీసు స్టేషన్‌లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారామె. దీంతో పోలీసులు 

సీమాన్‌ సూపర్‌..

ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష‍్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని  పేర్కొన్నారు. సీమాన్‌ సూపర్‌ అని.. ఆయన పవర్‌ ఫుల్‌ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష‍్మి పేర్కొన్నారు. సీమాన్‌ పవర్‌ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్‌ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. 

(ఇది చదవండి: హర్ఘసాయి హీరోగా మెగా సినిమా.. టీజర్‌ వచ్చేసింది)

మరిన్ని వార్తలు