Corona Virus: బాలీవుడ్‌లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు

14 Dec, 2021 19:40 IST|Sakshi

థర్డ్‌వేవ్‌పై ప్రజలంతా ఆందోళన చెందుతున్న తరుణంలో బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహర్‌ విందు పార్టీ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. కరణ్ హౌస్ పార్టీకి హాజరైన నలుగురు సెలబ్రిటీలకు వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కే3జీ(K3G) సినిమాకు 20ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ డిసెంబర్ 8న తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఆ తెల్లారే నటుడు సౌహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇదే పార్టీకి హాజరైన కరీనా కపూర్‌ఖాన్‌, అమృతా అరోరా కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారికి కూడా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది.  

చదవండి: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్‌

వీరితోపాటు పార్టీలో పాల్గొన్న సంజయ్‌ కపూర్ భార్య మహీప్‌ కపూర్‌ కూడా వైరస్ బారిన పడ్డారు. కరణ్ నివాసంలో డిన్నర్ పార్టీకి హాజరైన వాళ్లలో అలియా భట్‌, కరిష్మా కపూర్‌, మలైకా అరోరా, అర్జున్‌కపూర్‌, డిజైనర్ మసాబా గుప్తా సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పార్టీ జరిగిన మరుసటి రోజే కరీనా కపూర్‌, అమృత అరోరా అనిల్ కపూర్ పెద్దకూతురు రియా కపూర్‌ నివాసంలో జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రియా హౌస్‌ పార్టీకి హాజరైన సెలబ్రిటీలు కూడా సెల్ఫ్ ఐసోలేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే కరణ్‌ జోహార్‌కు మాత్రం కొవిడ్ నెగెటివ్ వచ్చినట్టు సమాచారం.

చదవండి: పార్టీలతో హల్‌చల్‌.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్‌

ఇక బాలీవుడ్‌ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన వారికి ఎవరెవరూ క్లోజ్‌గా కాంటాక్ట్స్‌ అయ్యారో వారిని వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ మేరకు కరీనా అపార్ట్‌మెంట్‌లో బీఎంసీ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌, కరిష్మా కపూర్‌ సహా పలువురికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసినట్టు తెలిసింది. అలాగే కరణ్ జోహార్‌, కరీనా కపూర్‌, అమృతా అరోరా నివాసాలను బీఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు. వాటిని కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి పాజిటివ్ వచ్చిన వారిని ఎవరూ కాంటాక్ట్‌ అయ్యారో వారిని ట్రెసింగ్‌ చేసే పనిలో బీఎంసీ పడింది.

మరిన్ని వార్తలు