నెల రోజుల్లో షూటింగ్ పూర్తి.. వాలంటైన్స్ డేకి రిలీజ్

15 Nov, 2023 18:01 IST|Sakshi

అజయ్‌ అర్జున్‌ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్‌ అర్జున్‌ నిర్మిస్తున్న చిత్రం 'అజయన్‌ బాలావిన్‌ మైలాంజి'. ప్రముఖ రచయిత అజయన్‌ బాల కథ, మాటలు రాసి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటుడు శ్రీరామ్‌ కార్తీక్‌ ,గిరీష కురూప్‌, సింగం పులి, మునీష్‌ కాంత్‌, తంగదరై తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి పూర్తి అయినట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు)

ఇది కొండ పరిసర ప్రాంతాల్లో సాగే సరికొత్త ప్రేమకథ సినిమా అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. పర్యాటక పరిరక్షణ గురించి తెలిపే చిత్రమని అన్నారు. షూటింగ్ అంతా నెలరోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. కాగా మైలాంజి అనే టైటిల్‌ తో ఇప్పటికే ఒక చిత్రం విడుదల కావడంతో తమ చిత్రానికి అజయన్‌ బాలావిన్‌ మైలాంజి అని పేరు మార్చినట్లు వివరించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 

ఈ చిత్ర కథను విన్న సంగీత దర్శకుడు ఇళయరాజా చాలా ఇంప్రెస్‌ అయ్యి చిత్రంలోని నాలుగు పాటలను ఆయనే రాసి సంగీతాన్ని అందించినట్లు దర్శకుడు చెప్పారు. కథను నమ్మి ప్రముఖ సాంకేతిక వర్గంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. దీనికి చెళియన్‌ ఛాయాగ్రహణం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్రాన్ని 2024 ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!)

మరిన్ని వార్తలు