Allu Aravind: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అంతా ఆక్రమించేయాలనుకోవడం కరెక్ట్‌ కాదు

1 Jun, 2023 17:01 IST|Sakshi

నా ద్వారా పైకి వచ్చిన దర్శకులు చాలామంది గీత దాటారన్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. కెరీర్‌లో కొంత సక్సెస్‌ కాగానే ఆ విషయం మర్చిపోయి గీత దాటి వేరే సినిమాలు చేశారని పేర్కొన్నాడు. మే 5న మలయాళంలో రిలీజైన 2018 మూవీ అక్కడ రూ.150 కోట్ల మార్క్‌ టచ్‌ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గురువారం థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.

జూనియర్స్‌కు స్పేస్‌ ఇవ్వాలి
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్‌ చేశాడు. 2018 మూవీ చూశా, ఇది మనం తెలుగులో రిలీజ్‌ చేయాలి అని చెప్పాడు. ఇతర భాషల్లో వస్తున్న మంచి సినిమాలన్నీ మనమే చేస్తున్నం కదా.. ఇది కూడా మనమే చేద్దాం అంటే సరేనన్నాను. అయితే ఇక్కడ నేను గానీ, దిల్‌ రాజుగానీ.. సీనియర్స్‌ అందరం జూనియర్స్‌కు స్పేస్‌ ఇవ్వాలి. అందులో వాళ్లను ఎదగనివ్వాలి. మొత్తం మనమే ఆక్రమించేసి మనమే పైకొచ్చేయాలనేది సరి కాదు. పక్కవాళ్లకు స్పేస్‌ ఇవ్వడమే నా ఆటిట్యూడ్‌. 

ఇప్పటికీ నాకోసం నిలబడ్డాడు
చందూ మొండేటి కార్తికేయ 2 తీసి ఏడాది దాటిపోయింది. అయితే ఆ సినిమా రిలీజవకముందే నాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్‌మెంట్‌ ఉంది. కార్తికేయ 2 రిలీజ్‌ కాకముందే అతడో గొప్ప డైరెక్టర్‌ అని గ్రహించి బుక్‌ చేసుకున్నాను. నాద్వారా పైకొచ్చినవాళ్లలో చాలామంది గీత దాటారు. వాళ్ల పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ చందూ మొండేటి మాత్రం నాతో సినిమా చేయడానికే నిలబడ్డారు' అని వ్యాఖ్యానించాడు అరవింద్‌. అయితే అల్లు అరవింద్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: అమ్మాయిలపై అత్యాచారం... నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష

మరిన్ని వార్తలు