దిల్‌ రాజుకు హ్యాండిచ్చిన బన్నీ.. ‘ఐకాన్‌’ అటకెక్కినట్టేనా!

13 Nov, 2021 15:50 IST|Sakshi

కొన్నేళ్లుగా అల్లు అర్జున్‌ ‘ఐకాన్’ అనే సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది. భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు దిల్ రాజు కూడా రెడీగా ఉన్నాడు. కానీ బన్ని మాత్రం ఎందుకో ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేశాడని ఇండస్ట్రీలో జోరుగా టాక్స్ వినిపిస్తున్నాయి.

ఐకాన్ ప్రాజెక్ట్ లో ఐకాన్ స్టార్ అడుగు పెట్టడం లేదంటూ మళ్లీ రూమర్స్  మొదలయ్యాయి. ఎప్పుడో 2018లో నా పేరు సూర్య రిలీజ్ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. కాని అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఒకసారి అలవైకుంఠపురములో తర్వాత స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపించింది. ఆ తర్వాత ఇమిడియెట్ గా పుష్ప స్టార్ట్ అయింది. ఫుష్ప పార్ట్ 1 రిలీజైన తర్వాత తెరకెక్కుందని టాక్ వినిపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బన్ని మరో ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. ఐకాన్ ప్రాజెక్ట్ ను మరోసారి పెండింగ్ లో పెట్టాలనుకుంటున్నాడట.

మరికొద్ది రోజుల్లో పుష్ప పార్ట్ 1న షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నిజానికి వేణుశ్రీరామ్ మేకింగ్ లో ఐకాన్ స్టార్ట్ చేయాలి. కాని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్లేస్ లో బోయపాటితో సినిమా చేయాలనుకుంటున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అంతకుమించిన వసూళ్లను, పైగా పాన్‌ ఇండియా స్థాయిలో కొల్లగొట్టాలి అనుకుంటున్నాడట అల్లు అర్జున్. మరి బన్నీ ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు