‘ఈఎమ్‌ఐలు నేనే చెల్లిస్తున్నా.. ఇదిగో సాక్ష్యాలు’

15 Aug, 2020 12:37 IST|Sakshi
సుశాంత్‌, అంకిత (ఫైల్‌)

ముంబై : తాను నివసిస్తున్న ప్లాట్‌కు సంబంధించిన ఈఎమ్‌ఐలను తనే చెల్లిస్తన్నట్లు సుశాంత్‌ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండే పేర్కొన్నారు. తన ఫ్లాట్‌ కోసం సుశాంత్‌ ఏ రోజు ఈఎమ్‌ఐలు చెల్లించలేదని ఆమె స్పష్టం చేశారు. సుశాంత్‌ వివిధ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి 15 కోట్ల రూపాయలు మాయమైయినట్లు తన తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీ లాండరింగ్‌ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)..  సుశాంత్‌ 4.5 కోట్ల రూపాయలు ఓ ప్లాట్‌ ఈఎమ్‌ఐ చెల్లిస్తున్నట్లు  ఈడీ వర్గాలు వెల్లడించాయి. (మాజీ ప్రేమికురాలి ప్లాట్‌ ఈఎమ్‌ఐలు చెల్లించిన సుశాంత్‌)

ముంబైలోని మలాడ్‌లో ఉన్న ఈ ప్లాటులో ప్రస్తుతం అంకితా లోఖండే నివసిస్తున్నారు. అయితే సుశాంత్‌ నుంచి ఈ ఫ్లాట్‌ను అంకితా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఇదే విషయంపై రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించినప్పుడు.. సుశాంత్‌ అంకిత కోసం ఈఎమ్‌ఐలు చెల్లించాడని.. వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్‌ ఖాళీ చేయమని కోరలేదని రియా తెలిపింది. (సుశాంత్ అన్ని విష‌యాల్లో రియాదే నిర్ణ‌యం)

ఈ విషయంపై అంకితా శనివారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. తన ఫ్లాట్  రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పంచుకున్నారు. ‘నాపై వస్తున్న ఆరోపణలకు చెక్‌ పెడుతున్నాను. ఇవి నా ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు. నా బ్యాంక్‌  స్టేట్‌మెంట్‌ వివరాలు. నా ఫ్లాట్‌ ఈఎమ్ఐలను నేనే చెల్లిస్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను’. అని ట్వీట్‌ చేశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అంకితా లోఖండే  ఫ్లాట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు కన్పిస్తోంది. సుశాంత్‌ ఫ్లాట్‌ నెం 403ను కొనుగోలు చేశాడు. అలాగే అంకితా లోఖండే 404 ఫ్లాట్‌ కొన్నారు. సుశాంత్ తన ఫ్లాట్ ఈఎమ్‌ఐ చెల్లిస్తున్నట్లు, అంకిత తన ఇంటి ఈఎమ్‌ఐ చెల్లిస్తున్నట్లు ఆమె బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా తెలుస్తోంది. (‘సుశాంత్‌ మా కొడుకు లాంటివాడు’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు