Ashish Vidyarthi: జీవితంలో చాలా కోల్పోయాం.. ఆశిష్ విద్యార్థితో పెళ్లిపై స్పందించిన రుపాలీ

15 Sep, 2023 09:35 IST|Sakshi

ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి  60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్‌ ఎంట్రప్రెన్యూర్‌ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లిపై  ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సుమారు 22 ఏళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు.

(ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్‌లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?)

ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు నెలలు దాటినా ఆయనపై ట్రోల్స్‌ ఆగడం లేదు.. ఇప్పుటికే వాటిని ఆయన సున్నితంగా తిరష్కరించారు కూడా.. తాజాగా మళ్లీ ఆయనతో పాటు రెండో భార్య రుపాలీ బరూవా కూడా స్పందించారు. తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ ఇలా స్పందించారు. 'నన్ను తిట్టే వాళ్లందరూ నాకు తెలియని వ్యక్తులే కాబట్టి నేను దానిని పట్టించుకోను తిరిగి వారిని కూడా తిట్టుకోలేదు. మా జీవితంలో జరిగిన విషయాల గురించి వారికి స్పష్టంగా తెలియదు.. అందరిలాగే వారు కూడా ఈ విషయాన్ని చూశారు.

ఎందుకంటే వారికి నా గురించి తెలియదు. వాళ్లందరూ నన్ను తిడుతున్నారని వారి వద్దకు వెళ్లి క్లారిటీ ఇవ్వలేను. నెటిజన్లలో ఒక వర్గం వారు తిడితే మరో వర్గం వారు అర్థం చేసుకుంటారు. అలా ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కామెంట్లను అంతగా చదవనందున ఇది నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. నా సన్నిహితులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు వేరే వారి సపోర్ట్‌ అవసరం లేదు.' అని ఆమె చెప్పింది.

(ఇదీ చదవండి: సూర్య కోసం సెన్సేషనల్‌ హీరోయిన్‌, విలన్‌ ఎంట్రీ)

ఇంతలో, ఆశిష్ విద్యార్థి కలుగజేసుకుని ఇలా చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఈ రెండు విషయాలపై మరోకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఏ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. మా మధ్య కలత లేదు, కోపం లేదు. మమ్మల్ని తిడితే మీకు సంతోషమా..? అయితే అలాగే చేయండి. నా రెండో పెళ్లిపై ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ? 22 ఏళ్లుగా నా మొదటి భార్యతో జీవితాన్ని పంచుకున్నాను. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో సంసారం చితికిపోయింది. అప్పుడు నేను ఒంటరివాడినయ్యాను. అలాంటి సమయంలో రుపాలీ నా జీవితంలోకి వచ్చింది.' అని ఆయన అన్నారు.

జీవితంలో ఇద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో ఒక తోడు దొరకడం , కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం అని రుపాలి ఇలా తెలిపారు. 'విశ్వం ఈ అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయం. దీని ముందు నా జీవితంలో మరేదైనా చిన్నదే. నేను ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఈ వయసులో తోడు దొరకడం ఒక వరం. ఆ ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే.' అని ఆమె చెప్పింది.  కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్‌ స్టోర్‌లో రుపాలీకి భాగస్వామ్యం ఉంది. తన తండ్రి నార్త్‌ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఆశిష్ విద్యార్థి కూడా విశాల్ భరద్వాజ్ స్పై-థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.

A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1)

మరిన్ని వార్తలు