ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం

12 Mar, 2024 16:47 IST|Sakshi

గత కొన్ని నెలలుగా మలయాళ  ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా థ్రిల్లర్, సస్పెన్స్‌ చిత్రాలే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో  తాజాగా, మరో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలను పొందిన 'ఆట్టం' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల అయిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దమ్మురేపింది. 

ఆట్టం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండటంతో చాలామంది ఈ చిత్రాన్ని చూస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులను ఎక్కడా కూడా బోర్‌ కొట్టించకుండా కథ ఉండటంతో ఓటీటీలో కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఆట్టం చిత్రంలో జరీన్ షిహాబ్, కళాభవన్ షరోజాన్, వినయ్ ఫోర్ట్, జాలీ ఆంథోనీ, మదన్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఏకర్ డైరెక్ట్‌ చేశారు. బాసిల్ సీజే సంగీతం అందించగా జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అట్టం కథ, కథనంలో సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ బాగా ఉండటంతో పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది. నాటకాలు ప్రదర్శించే ఒక టీమ్‌లో 12 మంది పురుషులు ఉండగా.. అందులో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో వారి గ్రూపులో విభేదాలు వస్తాయి. ఆ నేరం ఎవరు చేశారు అనే విషయంలో పలు నాటకీయత అంశాలు తెరపైకి వస్తాయి. ఫైనల్‌గా ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేసింది ఎవరు..? అని కనుగునే క్రమంలో కథ చాలా ఆసక్తిగా ఉంటుంది.

Election 2024

మరిన్ని వార్తలు