బంగారం మూవీలో హీరోయిన్‌ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా?

17 Nov, 2021 12:17 IST|Sakshi

Bangaram Movie Child Artist, Sanusha Santhosh Present Photos Goes Viral: పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’సినిమాలో హీరోయిన్‌ చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? వింధ్య రెడ్డి పాత్రలో నటించి మెప్పించిన ఆ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ పేరు సనూషా సంతోష్. బంగారం సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అయితే అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 20కి పైగా సినిమాల్లో నటించింది. అలా ఉత్తమ బాలనటిగా చిన్న వయసులోనే రెండు సార్లు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.

2012లో మిస్టర్‌ మురుగన్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన సనూషా..ఆ తర్వాత రేణిగుంట, జీనియస్‌ వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్‌ రమ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తుంటుంది.

అయితే ఈ అమ్మడి శరీరాకృతిపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్‌ చేసినా ధీటుగా జవాబిస్తుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సానుష..లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో నిరాశ, ఒంటరితనాన్ని ఫీలయ్యానని, ఆ సమయంలో ఎవరికి తెలియకుండా ఓ మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్లు తెలిపింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు