కరోనా: నటి శ్రీప్రద అకాలమరణం

6 May, 2021 19:09 IST|Sakshi

దివంగత నటి శ్రీదేవి లోని మొదటి అక్షరం ‘శ్రీ​‍

హీరోయిన్‌  జయప్రదలోని చివరి అక్షరాలు కలిపి ‘శ్రీపద’గా పాపులర్‌ అయిన నటి

సాక్షి, ముంబై:  రెండో దశలో కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజువారీ కేసుల నమోదులో 4 లక్షల  మార్క్‌ను  దాటేసింది. దేశవ్యాప్తంగా  4వేల  కోవిడ్‌ మరణాలతో  వణికిస్తోంది. ముఖ్యంగా   సినీ రంగంలో భారీ ప్రకంపనలే రేపుతోంది. తాజాగా బాలీవుడ్‌ నటి  శ్రీపద  కరోనాతో కన్ను మూశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  ట్విటర్‌ ద్వారా  శ్రీపద మరణంపై  తీవ్ర సంతాపం ప్రకటించింది.

భోజ్‌పురికి చెందిన శ్రీపద 80- 90లలో సూపర్‌ స్టార్లు ధర్మేంద్ర, వినోద్‌ ఖన్నా నటించిన బట్వారాతోపాటు, దిల్‌రూబా తంగేవాలి, షోలే ఔర్ తూఫాన్ లాంటి అనేక హిందీ మూవీలతోపాటు, భోజ్‌పురీ, కొన్ని దక్షిణ చిత్రాలలో కూడా నటించారు. ముఖ్యంగా  కైసీ యే యారియాన్, జీ హర్రర్ షో, అధూరి కహానీ హమారీ టీవీ  షోలతో పాపులర్‌అయ్యారు.  శ్రీపద బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రముఖ నటి  శ్రీదేవి, జయప్రద నుంచి శ్రీప్రదగా పేరు పెట్టుకున్నారు.  1978 లో "పురాణ పురుష్" తో ప్రారంభించిన ఆమె కరియర్‌ స్టార్టింగ్‌లో గోవింద, రాజ్ బబ్బర్ లాంటి ప్రముఖుల సరసన  నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. "ధరం సంకట్‌",  "ఉమర్ 55 కి దిల్ బచ్పాన్ కా", "అఖీర్ కౌన్‌ థీ వో? "," లూటెరే ప్యార్ కే "  మూవీల్లోని పాత్రలతో గుర్తించు తెచ్చుకున్నారు.

A post shared by Sudhaa Chandran (@sudhaachandran)

మరిన్ని వార్తలు