అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్‌ప్రైజ్‌

21 Jun, 2021 20:37 IST|Sakshi

యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌న అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన నూతన ఇంటి గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించి సదరు అభిమాని ఫంక్షన్‌కు వెళ్లి అతడికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాప‌కాన్ని అందించాడు బెల్లంకొండ. అసలు విషయం ఎంటంటే.. క‌ర్నూలుకు చెందిన ఓ వ్య‌క్తి బెల్లంకొండ శ్రీనివాస్‌కు వీరాభిమాని. అయితే ఇటీవల అతడు నూతన ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా శ్రీనివాస్‌కు ఆహ్వానం అందించాడు.

దీంతో అభిమాని కోరిక మేరకు శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు తండ్రి బెల్లంకోండ సురేశ్‌, తల్లి  పద్మ, సోదరుడు గణేశ్‌ను కూడా తీసుకుని హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు పయనమయ్యాడు. కరోనా ‍కారణంగా కాలు బయటక పెట్టలేని పరిస్థితిలో కూడా అభిమాని ఫంక్షన్‌కు కుటుంబ సమేతంగా హాజరవ్వడం అనేది సాధారణ విషయం కాదు. ఇలా ఆ అభిమాని కోరికను మన్నించి కుటుంబ సమేంతంగా ఆ ఫంక్షన్‌కు హాజరై అతడికి, అతడి కుటుంబానికి బెల్లంకొండ ఫ్యామిలీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. అది చూసి నెటిజన్లు, అభిమానులు బెల్లకొండ శ్రీనివాస్‌, అతడి ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు