బిగ్‌బాస్‌: 100 స్లారు ఐలవ్యూ అని ఎవరు చెప్పారు.. కాజల్‌పై మానస్‌ ఫైర్‌!

7 Dec, 2021 18:53 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. మరో పక్షం రోజుల్లో ఈ బిగ్‌ రియాల్టీ షోకి శుభం కార్డు పడుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది రోజుల్ని మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు. దీంట్లో భాగంగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు ఇస్తున్నారు. మంగళవారం ఇంటి సభ్యులకు ‘రోల్‌ ప్లే’టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌-5 కంటెస్టెంట్స్‌ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపించారు ఇంటి సభ్యులు. సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్‌ మానస్‌లా మారిపోయింది. ఇలా ఒక్కొక్కరు వేరే వేరే పాత్రలు ధరించి.. వారిని ఇమిటేట్‌ చేశారు.

ఈక్రమంలో మానస్‌, సన్నీ, కాజల్‌ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. టాస్క్‌లో భాగంగా మానస్‌ క్యారెక్టర్‌లో ఉన్న కాజల్‌.. ప్రతిసారి పింకీకి ఐలవ్యూ చెప్పడాన్ని మానస్‌ తప్పుపట్టాడు. గబ్బు చేస్తే బాగుండదని మానస్‌ ముందే హెచ్చరించగా.. ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్‌టైనింగ్‌ చేస్తున్నామని కాజల్‌ చెప్పబోగా.. ‘ఎంటర్‌టైనింగ్‌గా చేస్తే చేయ్‌.. కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్‌ సీరియస్‌ అయ్యాడు. దీంతో బాగా హర్ట్‌ అయిన కాజల్‌.. మానస్‌ క్యారెక్టర్‌ చేయనని బయటకు వెళ్లిపోయింది. మరి ఈ గొడవ ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు