Bigg Boss 7 Day 82 Highlights: ప్లేటు తిప్పేసిన శివాజీ.. అమర్‌కి సపోర్ట్ చేసినట్లే చేసి!

24 Nov, 2023 23:18 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో అమర్ మరోసారి బలైపోయాడు. శివాజీ దారుణంగా మోసం చేశాడు. దీంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. చివర్లో ఓకే చెప్పాడు గానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో హౌస్‌మేట్స్ అందరూ షాకయ్యారు. అయితే ఆ ఒక్కటి చేయకపోవడమే అమర్ కెప్టెన్సీపై దెబ్బేసింది. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 82 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

చివరి కెప్టెన్సీ టాస్క్
ఈ వారం నామినేషన్స్ తర్వాత 'హత్యల టాస్క్' ఇచ్చిన అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. అది అయిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ఏడో సీజన్‌లో చిట్టచివరి కెప్టెన్ కోసం 'పాయింట్ బ్లాంక్' అని టాస్క్ పెట్టడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ గేమ్ ప్రకారం.. ఓ చోట రెండు ఫొటోలు చూపిస్తారు. ఇద్దరు హౌస్‌మేట్స్ ఓ నిర్ణయానికొచ్చి, ఆ రెండు ఫొటోల్లో కెప్టెన్ కావడానికి ఎవరు అనర్హులో గన్‌తో కాల్చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ)

ఎవరు ఎవరిని కాల్చారు? ఎవరిని సేవ్ చేశారు?
హౌస్‌మేట్స్            షూట్-సేఫ్

  • గౌతమ్ , ప్రియాంక - శోభా, అర్జున్
  • ప్రశాంత్, శోభాశెట్టి - అశ్విని, అమర్
  • యావర్, రతిక - ప్రశాంత్, శివాజీ
  • శివాజీ, అశ్విని - యావర్, అర్జున్
  • అమర్, అర్జున్ - ప్రియాంక, శివాజీ
  • యావర్, రతిక - గౌతమ్, అర్జున్
  • ప్రియాంక, అశ్విని - రతిక, అమర్
  • అమర్, గౌతమ్ - శివాజీ, అర్జున్
  • శివాజీ, శోభా - అర్జున్, అమర్

అమర్‌ కెప్టెన్సీ పిచ్చి
గత వీకెండ్ సందర్భంగా.. 12వ వారం గురించి రెండు ట్విస్టులు ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం చివరిదని హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో అమర్, అశ్విని, రతిక.. కెప్టెన్ కాలేదు. దీంతో అమర్, తన ఫొటో కాల్చొద్దని అందరినీ బతిమలాడుకున్నాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు కూడా. అయితే మిగతా వాళ్లతో పోలిస్తే.. నేను కెప్టెన్ అ‍వ్వాలి, లేకపోతే ఉండలేను అనేంత రేంజులో అమర్ హడావుడి చేశాడు. దీన్ని పిచ్చి అంటారా? లేదా ఇంకేదైనా అంటారా అనేది అర్థం కాలేదు.

శివాజీ వెన్నుపోటు?
హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి అమర్ అంటే శివాజీకి ఎందుకో కోపం. కారణమున్నా లేకపోయినా సరే కొన్నివారాలు అతడినే నామినేట్ చేసేవాడు. ఇక ఇది చివరి వారమని.. తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని.. టాస్క్ ప్రారంభానికి ముందే అమర్ అడిగాడు. దానికి శివాజీ కూడా సరేనన్నాడు. కానీ చివర్లో అర్జున్, అమర్ ఫొటోలు వచ్చేసరికి తన ఓటు అర్జున్‌కి వేస్తున్నట్లు చెప్పాడు. అమర్ విషయంలో ప్లేటు తిప్పేశాడు. శివాజీకి జోడిగా ఉన్న శోభా మాత్రం.. అమర్ పేరు చెప్పింది. దీనిబట్టి చూస్తే శివాజీ.. మరోసారి అమర్‌ అంటే కోపాన్ని బయటపెట్టడంతో పాటు వెన్నుపోటు పొడిచేశాడు.

(ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ)

అదే కొంపముంచింది
అయితే అర్జున్ భార్య అతడిని కెప్టెన్ కావాలని కోరుకుందని, అందుకే తన పేరు చెప్పినట్లు శివాజీ తన కారణం చెప్పాడు. దీంతో అమర్-శివాజీ మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది. అమర్ అయితే నేను ఎలాగైనా కెప్టెన్ కావాలన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓవైపు అర్జున్ తన స్టాండ్ బలంగా చెబుతుండేసరికి.. ఇది ఎంతకీ తెగలేదు. దీంతో ఇక నిర్ణయం చెప్పకపోతే.. కెప్టెన్సీనే పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించాడు. అప్పుడు ఇక వేరే దారిలేక శోభా-శివాజీ కలిసి.. అర్జున్ పేరు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

అర్జున్ ఫొటోతో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అయితే ఈ విషయంలో శివాజీది ఎంత తప్పుందో అమర్‌ది కూడా అంతే తప్పుందని చెప్పొచ్చు. ఏడుస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా శివాజీని కన్విన్స్ చేసి ఉండాల్సింది. కానీ బ్యాడ్ లక్. నిర్ణయం ఆలస్యమయ్యేసరికి అర్జున్‌తో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. మరీ అమర్ కొత్త కెప్టెన్ అవుతాడా? లేదా? అనేది శనివారం ఎపిసోడ్‌లో తేలుతుందిలే.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)

మరిన్ని వార్తలు