లగ్జరీ కారు కొన్న అషు భామ.. కానీ వాటికి చెక్ పెట్టింది!

31 Oct, 2023 16:35 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ అషురెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్‌తో ఫేమస్ అయిన అషు పలు టీవీ షోల్లో కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ కామెడీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ అలరిస్తూనే ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటోంది.

(ఇది చదవండి: బిగ్‌బాస్‌లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!)

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దాదాపు రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్‌ కారును సొంతం చేసుకుంది. అనంతరం లగ్జరీ కారుకు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది. తన కొత్త కారు రేంజ్ రోవర్‌కు వేణుగోపాల స్వామితో పూజలు చేయించింది. అయితే సినీ తారలపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. అందువల్లే కామెంట్స్ చేయకుండా.. ఆ సెక్షన్‌ను క్లోజ్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu)

మరిన్ని వార్తలు