Himaja: రేవ్‌ పార్టీలో బిగ్‌బాస్‌ బ్యూటీ? స్పందించిన హిమజ

12 Nov, 2023 13:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్‌ పార్టీని భగ్నం చేశారంటూ ఓ వార్త వైరలవుతోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి హిమజ ఆధ్వర్యంలో ఈ రేవ్‌ పార్టీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హిమజ సహా 11 మంది సినీతారలు, బిగ్‌బాస్‌ సెలబ్రిటీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా ఈ వార్తలపై హిమజ స్పందించింది. 'నిన్న నా కొత్తింట్లో తొలిసారి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ అందరితో కలిసి పార్టీ చేసుకున్నాను. ఎవరో.. ఏదో అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మా ఇంటిని సోదా చేశారు.. అందుకు మేము కూడా సహకరించాం. వాళ్ల విధిని వాళ్లు నిర్వర్తించారు. అయితే కొందరు దీన్ని రేవ్‌ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నేను ఇంట్లోనే ఉన్నాను. సంతోషంగా దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటుంటే నేను అరెస్ట్‌ అయి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. దయచేసి దాన్ని ఎవరూ నమ్మవద్దు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో క్లారిటీ ఇచ్చింది.

చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్‌

మరిన్ని వార్తలు