Bigg Boss 5 Telugu: ఎలిమినేషన్‌ జోన్‌లో ఏడుగురు?!

6 Sep, 2021 20:02 IST|Sakshi

బోర్‌డమ్‌ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అంటూ ఆడియన్స్‌కు మాటిచ్చేశాడు నాగ్‌. అన్నట్లుగా ఎక్కువ వినోదాన్ని అందించాలంటే అంతే ఎక్కువ కంటెస్టెంట్లు ఉండాలనుకున్నారో ఏమోగానీ ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపారు.

వీరిలో నటి సిరి హన్మంత్‌, వీజే సన్నీ, నటి లహరి, సింగర్‌ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌, లోబో, ప్రముఖ నటి ప్రియ, మోడల్‌ జశ్వంత్‌ పడాల(జెస్సీ), ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్‌ జశ్వంత్‌, నటి హమీదా, నటరాజ్‌ మాస్టర్‌, నటి ఉమాదేవి, విశ్వ, 7ఆర్ట్స్‌ సరయూ, నటుడు మానస్‌, ఆర్జే కాజల్‌, నటి శ్వేత వర్మ, యాంకర్‌ రవి ఉన్నారు. నేడు హౌస్‌లో నామినేషన్‌ ప్రక్రియ జరగబోతోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కాగా ఈవారం నామినేషన్‌లో ఉండేది వీరేనంటూ ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీని ప్రకారం.. యాంకర్‌ రవి, జెస్సీ, మానస్‌, హమీదా, కాజల్‌, సరయూ తొలివారం నామినేట్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రియ కూడా ఈ లిస్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో మొట్టమొదట సేవ్‌ అయ్యే కంటెస్టెంట్‌ యాంకర్‌ రవి అని ఊహించవచ్చు. యాంకర్‌ రవికి భారీ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటంతో అతడు ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కుతాడు. మరి మిగతా ఆరుగురిలో ఎవరు సేవ్‌ అవుతారు? ఈ లిస్టులో ఏమైనా మార్పుచేర్పులు ఉన్నాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

మరిన్ని వార్తలు