Bigg Boss Telugu 5: తండ్రి లేడని నీ దగ్గర అడ్వాంటేజ్‌ తీసుకోలేదు సిరి.. షణ్ముఖ్‌

26 Nov, 2021 23:58 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 83: బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టినందుకు సన్నీ తల్లి కళావతి తెగ సంబరపడిపోయింది. బిగ్‌బాస్‌ నీకు చెల్లెలిని ఇచ్చిందంటూ కాజల్‌ వంక చూడటంతో ఆమె సంతోషంతో గెంతులు వేసింది. ఇంటికి వచ్చిన అమ్మకు గోరుముద్దలు తినిపించాడు సన్నీ. ఈ సందర్భంగా ఆమె ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉన్న బాక్స్‌ను కొడుక్కు అందించడంతో అతడు ఫుల్‌ ఖుషీ అయ్యాడు. తర్వాత తల్లి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేయగా నీకు నా గెలుపును బహుమతిగా ఇస్తానని కళావతికి మాటిచ్చాడు.

సన్నీ దగ్గర ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉండటం వల్లే పింకీ అతడికి క్లోజ్‌ అవుతుందేమోనని అనుమానపడ్డాడు మానస్‌. 'పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్‌ఫ్రెండ్‌ ప్లేస్‌లో నన్ను రీప్లేస్‌ చేద్దామని చూస్తోంది. అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని చెప్పాను. మనం ఫ్రెండ్స్‌ మాత్రమే అని స్పష్టం చేశాను' అని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆమె చాలా అబద్ధాలు ఆడుతుందని, అది తనకు నచ్చదన్నాడు. ఇక హగ్గులు ఇచ్చుకోవడం నచ్చలేదని సిరి తల్లి చెప్పిన మాటలకు బాగా హర్టయ్యాడు షణ్ను. ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టడం వద్దని హితవు పలికాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరికి సూచించాడు.

అనంతరం ప్రియాంక సింగ్‌ వాళ్ల సోదరి మధు ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే నాన్న ఎందుకు రాలేదని నిలదీసింది పింకీ. నాన్నకు కళ్ల ప్రాబ్లమ్‌ ఉంది కాబట్టి రాలేదని బదులిచ్చింది మధు. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలెబట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు, గేమ్‌ మీద మాత్రమే ఫోకస్‌ చేయ్‌.. అని హెచ్చరించింది. అయితే మధు తాను సన్నీకి ఫ్యాన్‌ అని చెప్పింది.

తర్వాత రవి భార్య నిత్య హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమెను చూసిన రవి కొంత సంతోషిస్తూనే మరికొంత బాధకు లోనయ్యాడు. కూతురు వియా రాలేదేంటని నిరుత్సాహపడ్డాడు. ఇంతలో వియా హౌస్‌లోకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇవ్వడంతో అతడి ఆనందం కట్టలు తెంచుకుంది. సుమారు 80 రోజుల తర్వాత కూతురు స్పర్శ తగిలినందుకు ఎమోషనల్‌ అయ్యాడు. నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుందని రవికి ఫిర్యాదు చేసింది వియా. తర్వాత బిగ్‌బాస్‌ అంకుల్‌ ఎక్కడ? అంటూ అతడికోసం ఇల్లంతా వెతికి హంగామా చేసింది.

రవి.. తన భార్యకు షణ్నును పరిచయం చేస్తూ ఇతడు లైఫ్‌లాంగ్‌ తమ్ముడని చెప్పాడు. అతడితో నిత్య మాట్లాడుతూ.. రవి ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తాడంటారు, కానీ ఆయనకంత సీన్‌ లేదని తెలిపింది. చాన్నాళ్ల తర్వాత కూతురు కనిపించడంతో ఆమెతో సరదాగా ఆడుకున్నాడు రవి. వీళ్ల కోసం బిగ్‌బాస్‌ గుమ్మాడి గుమ్మాడి సాంగ్‌ప్లే చేయడంతో తండ్రీకూతుళ్లు డ్యాన్స్‌ చేశారు. తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌ను వదిలి వెళ్లాల్సిన టైం రావడంతో వియా గుక్కపెట్టి ఏడ్చింది.

అనంతరం షణ్ను తల్లి ఇంట్లో అడుగు పెట్టడంతో ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు. తన ప్రేయసి దీప్తి సునయన ఎలాగుంది అని అడిగి తెలుసుకున్నాడు. సిరి వాళ్ల మమ్మీ కొన్ని నచ్చట్లేదని బాధపడ్డారు అంటూ హగ్గుల గురించి మాట్లాడినదాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అవేమీ పట్టించుకోని షణ్ను మదర్‌.. దేని గురించి ఆలోచించకు, ఫ్రెండ్‌షిప్‌ కదా అంటూ కొడుక్కు సపోర్ట్‌ చేసింది. ఎక్కువ ఎమోషనల్‌ అయి గేమ్‌ పాడు చేసుకోకని హెచ్చరించింది. అందరితో కలిసి ఉండమని షణ్నుకు నొక్కి చెప్పింది. గేమ్‌గేమ్‌లా చూడండి, ఎక్కువ ఎమోషనల్‌ అవద్దని షణ్ను, సిరిలకు సూచించి వీడ్కోలు తీసుకుంది. మొత్తానికి భారంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ మీటింగ్‌ ముగిసింది.

మరిన్ని వార్తలు