Bigg Boss 5 Telugu: ప్రాంక్‌.. సిరి ఎలిమినేషన్‌ తూచ్‌, షణ్ను ఆనందం చూడతరమా!

18 Dec, 2021 00:32 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 104: సన్నీతో జరిగిన గొడవతో సిరి బాగా హర్ట్‌ అయినట్లు ఉంది. రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఏడుస్తూ ఉండిపోయింది. ఒక్క గేమ్‌ ఓడిపోతే ఓడిపోయినట్లేనా అంటూ అర్ధరాత్రి 1 గంటలకు బాత్రూమ్‌లో గుక్కపెట్టి ఏడ్చింది. తనను కొట్టడానికి సన్నీ మీదమీదకొచ్చాడంటూ వాపోయింది. దీంతో ఆమెను హత్తుకుని ఓదార్చిన షణ్ను ఎవడికీ కొట్టేంత సీన్‌ లేదని తేల్చి చెప్పాడు. నేనేదైనా అంటే ఫీల్‌ అవ్వు కానీ ఇంకెవడన్నా ఏడవద్దు, మూసుకుని కూర్చో అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

బిగ్‌బాస్‌ ప్రయాణంలో తుది మజిలీకి చేరుకున్న మీలో ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని కుదిపేసి ఉంటాయని, మీ జాతకాలేంటో తెలుసుకోండంటూ జ్యోతిష్యురాలు శాంతిని పంపాడు బిగ్‌బాస్‌. ఆమె మొదటగా షణ్ను గురించి చెప్తూ.. జీవితంలో మంచి మార్పు ఉండబోతుంది. మీ ప్రేమ జీవితం బాగుండబోతోంది. కొంగొత్త అవకాశాలతో కావాల్సినంత సంపాదించబోతారు అని చెప్పింది.

సన్నీ దగ్గరకు వచ్చేసరికి.. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. బయటకు వచ్చాక కొత్త ప్రయాణం మొదలుపెడతారు. కార్డ్‌లో స్వప్న సుందరి వచ్చింది అంటూ త్వరలో అతడు ప్రేమలో పడతాడని హింట్‌ ఇచ్చింది. ఇక సిరి గురించి చెప్తూ.. త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయని శుభం పలికింది. శ్రీరామచంద్రకు గెలుపు కార్డు వచ్చిందన్న ఆమె అతడు లోలోపల చాలా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాడంది. బిగ్‌బాస్‌ షో తర్వాత అతడికి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని పేర్కొంది. మానస్‌కు బిగ్‌బాస్‌ జర్నీ తర్వాత అన్నీ సాధించానన్న తృప్తి మిగులుతుందని తెలిపింది.

ఇక అందరి లవ్‌ లైఫ్‌ గురించి చెప్తూ వచ్చిన జ్యోతిష్యురాలు షణ్ముఖ్‌ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆగిపోయింది. బిగ్‌బాస్‌ షోలోని లవ్‌ లైఫ్‌ గురించి చెప్పాలా? బయట లవ్‌ లైఫ్‌ గురించి చెప్పాలా? అనడంతో సిరి, షణ్నులకు నోట మాట రాలేదు. వెంటనే షాక్‌ నుంచి తేరుకున్న షణ్ను బయట మాది ఐదేళ్ల రిలేషన్‌షిప్‌, తర్వాత ఎలా ఉండబోతున్నాం అని అడిగాడు. మీలో ఉన్న చిన్నచిన్న భయాలను తీసేస్తే సంతోషంగా ఉంటారని సమాధానమిచ్చిందావిడ. బిగ్‌బాస్‌ తర్వాత సిరి పెళ్లి చేసుకోవడంతో పాటు ఫారిన్‌కు హనీమూన్‌కు కూడా వెళ్తుందని చెప్పుకొచ్చింది.

తర్వాత సిరి, షణ్ను మరోసారి గొడవపడ్డారు. ఇద్దరి కోసం కాకుండా అందరికీ ఎందుకు వంట చేస్తావని మండిపడ్డాడు షణ్ను. నువ్వు పొద్దున చేసిన దోసెలు వాళ్లు తినలేదని, అలాంటప్పుడు మళ్లీ ఎందుకు వండతావని ఫైర్‌ అయ్యాడు. దీంతో రెచ్చిపోయిన సిరి.. నేను కష్టపడి వండితే ఎందుకు తినలేదని మానస్‌ను నిలదీసింది. మానస్‌ మాత్రం తాను తిన్నానని చెప్పాడు. సన్నీకి రైస్‌ తినాలనిపిస్తే పులిహోర చేసుకుని తిన్నాడని బదులిచ్చాడు. అయినప్పటికీ వినిపించుకోని సిరి, షణ్ను మా వంట మేము చేసుకుంటామని తేల్చేశారు.

ఇంతలో బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులందరినీ సూట్‌కేసులు ప్యాక్‌ చేసుకోమని చెప్పాడు. ఈ మాట విని అవాక్కైన హౌస్‌మేట్స్‌ అయిష్టంగానే బ్యాగులు సర్దుకున్నారు. మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుందంటూ షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఎవరు ఎలిమినేట్‌ అవ్వాలనేదానిపై మీ అభిప్రాయం చెప్పాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. మానస్‌, సన్నీ.. షణ్ముఖ్‌; శ్రీరామ్‌.. సిరి; షణ్ముఖ్‌.. సన్నీ; సిరి.. మానస్‌ ఎలిమినేట్‌ అవడానికి అర్హులని సూచించారు. బిగ్‌బాస్‌ మాత్రం అనూహ్యంగా సిరి ఇంటి నుంచి వెళ్తుందని ప్రకటించడంతో ఆమె, షణ్ను ఏడ్చేశారు. కానీ సన్నీ మాత్రం నువ్వెళ్లెట్లేదని బల్లగుద్ది చెప్పాడు. చివరికి అతడి మాటే నిజమైందనుకోండి.

సిరిని కన్ఫెషన్‌ రూమ్‌లో కూర్చోబెట్టి షణ్ను ఏడుస్తున్న వీడియో చూపించాడు బిగ్‌బాస్‌. షణ్ను కంటతడి పెట్టుకోవడాన్ని చూసి సిరి హృదయం ముక్కలైంది. వాడు అక్కడ ఏడుస్తున్నందుకు బాధపడాలో, నన్ను మళ్లీ హౌస్‌లోకి పంపిస్తున్నందుకు సంతోషపడాలో తెలీట్లేదంటూ గోడు వెల్లబోసుకుంది. గేటు నుంచి బయటకు వెళ్లగొట్టిన కాసేపటికే తిరిగి ఆమెను హౌస్‌లోకి పంపించారు. దీంతో సిరి ఆనందంతో వెళ్లి షణ్నును హత్తుకుని ముద్దులు పెట్టింది.

మరిన్ని వార్తలు