Bigg Boss Amardeep: పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌పై మొదటిసారి రియాక్ట్‌ అయిన అమర్‌ దీప్‌

5 Jan, 2024 15:55 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇచ్చిన  పల్లవి ప్రశాంత్‌ గెలుచుకుంటే రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్‌ దీప్‌ ఉన్నాడు. బిగ్‌ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్‌ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్‌, ప్రశాంత్‌ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్‌దీప్‌ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది.

ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్‌ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్‌ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని  పోలీసులు అయన్ను అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్‌ బెయిల్‌ మీద విడుదలయ్యాడు.

తాజాగా అమర్‌ మొదటిసారి బిగ్‌ బాస్‌ గురించి రియాక్ట్‌ అయ్యాడు. 'హౌస్‌ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్‌ బ్లాంక్‌గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది.  బిగ్‌ బాస్‌ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు  వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్‌ దక్కింది. బిగ్‌ బాస్‌ విన్నర్‌ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ  షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్‌ బాస్‌ ద్వారా వచ్చిన అచీవ్‌మెంట్స్‌ అని నేను భావిస్తాను.

పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ అనేది మిస్‌ అండర్‌స్టాండింగ్‌ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్‌ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి.  ఫ్యాన్స్‌ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్‌ అన్నాడు. 

Election 2024

Poll
Loading...
మరిన్ని వార్తలు