Bigg Boss OTT Telugu: నాకు కాలింది, మాడింది, దోస అయ్యింది : అరియానా

18 Apr, 2022 14:01 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోలో అన్ని రోజులు ఒక ఎత్తైతే, నామినేషన్స్‌ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు కూడా నామినేషన్స్‌ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి నామినేట్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోలో ఎనిమిదో వారం నామినేషన్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

షోలో మొదటి నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా కలిసున్న అషూ, అరియానా నామినేషన్స్‌లో మాత్రం బద్ద శత్రువులుగా మారినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక మరోవైపు ఎప్పటిలాగే బిందు, అఖిల్‌ ఈసారి కూడా నామినేషన్స్‌లో గొడవ పడ్డారు. స్రవంతి అనే ఎమోషన్‌ను యూజ్‌ చేసుకున్నావంటూ బిందు ఫైర్‌ అయ్యింది. దీంతో చిర్రెత్తిపోయిన అఖిల్‌ ఏం మాటలు మాట్లాడుతున్నావ్‌? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావ్‌ అంటూ మండిపడ్డాడు.

అజయ్‌, హమీదా కూడా ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకున్నారు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో అఖిల్‌, అషూ, అజయ్‌, అనిల్‌, హమీదా, బిందు నిలిచారు. వీరిలో బాబా భాస్కర్‌ మాస్టర్‌ పన పవర్‌ని ఉపయోగించి బిందుని సేవ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు