రాంచరణ్‌ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ

27 Jul, 2022 21:30 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: సరూర్‌నగర్‌లో రాంచరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను బీజేపీ అడ్డుకుంది. సరూర్‌నగర్‌ డివిజన్‌లోని విక్టోరియా మెమోరియల్‌ (వీఎం) హోంలో  మంగళవారం సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలుసుకున్న కార్పొరేటర్‌ శ్రీవాణి తన అనుచరులతో వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారు. తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్‌లకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

అనాథ పిల్లల పేరు మీద జేబులు నింపుకునేందుకే షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. చదువుకునే పిల్లలందరినీ రెండు గదుల్లో పెట్టి పాఠశాలను సినిమా షూటింగ్‌కి ఇవ్వడం ఏమిటని, తరగతి గది పక్కనే సినిమా షూటింగ్‌ నిర్వహిస్తే చదువుకునేది ఎలా అని నిలదీశారు. ఒకరోజు షూటింగ్‌కు రూ.3 లక్షల వరకు అద్దె రూపంలో తీసుకుంటున్నారని.. ఈ డబ్బంతా వీఎంహోం అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు