Ahimsa Movie Glimse: ఇంట్రెస్టింగ్‌గా దగ్గుబాటి అభిరామ్‌ అహింస 'గ్లింప్స్‌' వీడియో

9 Sep, 2022 17:16 IST|Sakshi

దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్‌ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలసిందే. ఇటీవలె ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఇందులో హీరోని కొందరు అడవిలో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించడం, తర్వాత వాళ్లు మళ్లీ లాక్కొచ్చి కొడుతుంటారు. ఈ గ్లింప్స్‌ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది.ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి హీరోయిన్‌గా న‌టించింది.  ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు