తెలుగుపై క్రేజ్‌ పెరిగింది..'లవ్‌స్టోరీ'తో వస్తోన్న ధనుష్‌..

27 Jun, 2021 21:25 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ ప్రస్తుతం యమ జోరుమీదున్నారు. ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్‌ ఇప్పుడు  టాలీవుడ్‌పై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో తమిళంతో పాటు తెలుగులోనూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరుచుకున్న ధనుష్‌ ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు.  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమాను ధనుష్‌ సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇక ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభించకముందే మరో తెలుగు మూవీకి ధనుష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ప్రాజెక్టుకు ధనుష్‌ ఇటీవలె పచ్చజెండా ఊపినట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. లవ్‌ స్టోరీ కథాంశంగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.  తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

చదవండి : కొత్తింటి కోసం ధనుష్‌ ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
లోకల్‌ ట్రైన్‌లో రజనీ అలా.. ఫోటోలు లీక్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు