తన ఆఫీసులోనే 200మందికి వ్యాక్సిన్‌ వేయించిన దిల్‌రాజు

22 Jun, 2021 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన ప్రొడక్షన్‌లో పనిచేసే సిబ్బంది, ఆఫీస్‌ స్టాఫ్‌ సహా 200మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రు క‌నీసం ఒక్క డోస్ అయనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని నిర్మాత మండ‌లి ఆదేశాల నేపథ్యంలో దిల్‌రాజు తన వ్యక్తిగత సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయించారు. తన ఆఫీస్‌లోనే వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఓ ప్రముఖ హాస్పిటల్‌తో ఒప్పందం కదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలె వకీల్‌సాబ్‌తో హిట్‌ కొట్టిన దిల్‌రాజు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. థ్యాంక్యూ, ఐకాన్‌, శాకుతలం చిత్రాలతో పాటు హిందీలో జెర్సీ రీమేక్‌ను కూడా నిర్మించనున్నారు. 

చదవండి : వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత దగ్గర డబ్బులు గుంజిన కేటుగాడు
అ‍ల్లు అర్జున్‌ను దారుణంగా అవమానించిన దిల్‌ రాజు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు