రూ.25 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌: సుకుమార్‌

21 May, 2021 09:09 IST|Sakshi

కంటికి కనిపించని కరోనా ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. ఇక చాలాచోట్ల కరోనా బాధితులు ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత తగ్గించేందుకు దర్శకుడు సుకుమార్‌ ముందుకు వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాడు.

తన స్నేహితుడు అన్యం రాంబాబుతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అధికారులతో బుధవారం చర్చించాడు. అనుమతులు లభిస్తే వెంటనే ప్లాంట్‌ నిర్మిస్తానని సుకుమార్‌ పేర్కొన్నాడు. దీనికోసం రూ.25 లక్షలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు అధికారులకు తెలిపాడు. మరోవైపు ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్న పేషెంట్ల కోసం ఆజాద్‌ ఫౌండేషన్‌కు రూ.7 లక్షల విలువైన సిలిండర్లు పంపించాడు. గతేడాది కూడా కరోనా పోరులో తనవంతు సాయంగా రూ.10 లక్షలు అందించిన విషయం తెలిసిందే.

కాగా సుకుమార్‌ ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా 'పుష్ప' తెరకెక్కిస్తున్నాడు. తర్వాత విజయ్‌ దేవరకొండతో పాటు, రామ్‌చరణ్‌తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రెండు భాగాలుగా ‘పుష్ప’

సలార్‌: ప్రభాస్‌కు అక్కగా తెరపైకి మరో హీరోయిన్‌ పేరు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు