‘శివకార్తికేయన్‌ చేసిన ఒక్క ఫోన్‌కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది’

8 May, 2022 10:12 IST|Sakshi

తమిళ సినిమా : ఆ విషయంలో తాము పూర్తిగా సక్సెస్‌ అయ్యామని హీరో శివకార్తికేయన్‌ అన్నారు. ఈయన తాజా చిత్రం డాన్‌. నటి ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సిబిచక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు.

ఈనెల 13వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం ముందస్తు ప్రసార కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి చెన్నైలో ఘనంగా నిర్వహించారు. శివకార్తికేయన్‌ చేసిన ఒక్క ఫోన్‌కాల్‌ తన జీవితాన్ని మార్చేసిందని, ఆయన తన నిజ జీవితానికి, రీల్‌ జీవితానికి ప్రాణం పోశారని సిబిచక్రవర్తి పేర్కొన్నారు. చిత్రాన్ని ప్రారంభించే ముందు లైకా ప్రొడక్షన్స్‌కు టేబుల్‌ ప్రాపర్టీని అందించాలని సంకల్సించామని, ఆ విషయంలో సక్సెస్‌ అయ్యామని చిత్ర కథా నాయకుడు శివకార్తికేయన్‌ పేర్కొన్నారు. ఇది ప్రతి కళాశాల విద్యార్థిని ప్రతిబింబించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కి చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేయడం మరింత సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు